గల్ఫ్ వలస కార్మికులకు బడ్జెట్లో చోటేది :ఈ టీ సి ఏ అధ్యకులు పీచర్ల కిరణ్ కుమార్
- March 25, 2017
ప్రవాసీ తెలంగాణ విధానాన్ని రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,బడ్జెట్ లో గల్ఫ్ వలస కార్మికులకు నిధులులు కేటాయించలేదని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు పీచర్ల కిరణ్ కుమార్ విమర్శించారు.సిరిసిల్ల జిల్లాకేంద్రం లో ఆయన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో తెలంగాణ వలస కార్మికులు దదాపు 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని,వారి సంక్షేమం కోసం ప్రవాసీ తెలంగాణ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ..రెండున్నరేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ప్రవాసీ తెలంగాణ మంత్రిత్వ శాఖ కేటీర్ చేతిలోనే ఉందని ఎంతోనమ్మకంతో ఏడాది కిందట హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించామని ఆయన విమర్శించారు,కానీ ఆచరణలో ఒక్క సమస్యకు కూడా పరిస్కారం లభించలేదన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువత కు నైపుణ్య శిక్షణ ఇచ్చి కంపెనీ వీసాలపై పంపిస్తామని, దళారుల విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు. గల్ఫ్ వలస కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రత్యక్షం గా చుసిన మంత్రి కేటీర్ వలస జీవులను ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదన్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులను విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవటం లేదన్నారు.తెలంగాణసాధన ఉద్యమం నుంచి రాష్టం ఆవిర్భావం తర్వాత సంబరాలవరకు అన్నింటా ముందున్న ఈ టీ సి ఏ ఈసంస్థ అనేక అంశా లతో గల్ఫ్ వలస కార్మికుల సమస్యలనుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని, మరియు నాలుగుపేజిల నివేదికను అందించిందన్నారు అయినప్పటికీ వారి సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవటం బాధకరమన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్ వలస కార్మికులనుఆదుకునేందుకు చర్యలను తీసుకోవాలని జైళ్లలో మగ్గుతున్న వారిని విడిపించాలన్నారు ఈసమావేశంలో ఈ టీ సి ఏ కోర్ కమిటీ సభ్యుడు గాంధారి సత్యనారాయణ,కల్చరల్ ఇంచార్జ్ పడాల లింగారెడ్డి పాల్గొన్నారు.
--సాయికృష్ణ యాదవ్
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







