తెలుగు తరంగిణి ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం
- March 26, 2017
తెలుగు తరంగిణి కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు.
అందరూ ఆసక్తికరంగా ఎదురు చూసే ఉగాది ఉత్సవాలు మీ అందరి అభిలాష మేరకు 31 మార్చ్ 2017 శుక్రవారం రోజు రస్ అల్ ఖైమా లోని బిట్స్ కాంపస్ లో నిర్వహించుటకు నిర్ణయించబడినది. ఈ కార్యక్రమం ఉదయం 9:00 లకు మొదలు అయి సాయంత్రం 5:00 ల వరకు కొనసాగుతుంది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కుటుంబ వినోద కార్యక్రమాలు, విందు భోజనాలు మరియు ఆట పాటలతొ ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కలిసి ఆనందించే ఉగాది ఉత్సవాలకు అందరికి తెలుగు తరంగిణి తరఫున హ్రుదయపూర్వక ఆహ్వానం .
ప్రముఖ తెలుగు ప్లేబాక్ సింగర్స్ డా. అరుణ్ కౌండిన్య (బోల్ బేబి బోల్, మెంటల్ పోలీస్, విన్నర్ ఫేం) మరియు కుమారి సత్య యామిని (బాహుబలి, సోగ్గాడే చిన్ని నాయన ఫేం) వారి పాటలతో మనల్ని ఉర్రూతలూగించేందుకు వస్తున్నారు. ఇంకా మన రస్ అల్ ఖైమా మరియు ఇతర ఎమిరేట్ల నుంచి బాల బాలికలు తమ సంప్రదాయ మరియు సినిమా నృత్యాలతో మనల్ని వారితో కలిపి చిందు వేయించడానికి సిద్ధం అవుతున్నారు.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం? అన్ని పనులు పక్కన పెట్టి శుక్రవారం అందరం కలిసి మీ బంధు మిత్ర సపరివార సమేతంగా ఉగాది పండుగ జరుపుకోవడానికి తరలిరండి.
ఇప్పుడు మన కార్యక్రమాలను Youtube ఛానల్ ద్వారా చూడవచ్చు. తాజా వీడియోలకోసం దయచేసి తెలుగు తరంగిణి Youtube ఛానెల్ సభ్యత్వానికి నమోదు చేసుకోండి. తాజా సమాచారం కొరకు తెలుగుతరంగిణి.కాం, తెలుగు తరంగిణి ఫేస్బుక్ పేజీలను తరచు చూడండి.
మీ ఆత్మీయ ఆగమనాభిలాషులు,
తెలుగు తరంగిణి పాలక సభ్యులు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







