బాహుబలి2 పాటలు ఈ రాత్రికే ఆన్లైన్లో
- March 26, 2017
ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసిన బాహుబలి2 సినిమా పాటలు ఈ రాత్రి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపాడు. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు జక్కన్న చెప్పాడు. రాజమౌళి ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు బాహుబలి2 సినిమా అభిమానులు కూడా ఆడియో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీత సారథ్యంలో విడుదల కానున్న ఈ పాటలు శ్రోతలను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం భావిస్తోంది. బాహుబలి సినిమాలోని పాటలకు ఎంత క్రేజ్ వచ్చిందో, అంతకన్నా ఎక్కువగా ఈ పాటలు అలరిస్తాయని కీరవాణి చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా లిరిక్స్‌కు సంబంధించిన వివరాలు బయటికొచ్చేశాయి.
బాహుబలి2 సినిమాలో మొత్తం 5 పాటలున్నట్లు తెలుస్తోంది. ఆ పాటల జాబితా ఇదే.
1. సాహోరే బాహుబలి 2.హంస నావ 3. కన్నా నిదురించరా 4. దండాలయ్యా 5. ఒక ప్రాణం
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







