టీజర్ రిలీజ్ డేట్ సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు'
- March 26, 2017
జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా, ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. .పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం టీజర్ ని ఉగాదిశుభాకాంక్షలతో విడుదల చేయనున్నారు. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వరలోనే ఆడియోని విడుదల చేసి, సమ్మర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం యెక్క టీజర్ ని ఉగాది పర్వదినాన విడుదల చేయనున్నాము. చాలా గ్యాప్ తరువాత సునిల్ తరహా కామెడి చూస్తారు. . మా చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవ్వించమే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా కథలోని కామెడి ని పోందు పరచి నవ్విస్తాము. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ లు ముఖ్యపాత్రల్లో నటించారు. అతిత్వరలో ఆడియోని విడుదల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్రమే చేశాము. ఈ సమ్మర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







