రేపు పార్లమెంట్‌కు జీఎస్‌టీ బిల్లు

- March 26, 2017 , by Maagulf
రేపు పార్లమెంట్‌కు జీఎస్‌టీ బిల్లు

కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్‌టీలో భాగమైన సీ-జీఎస్‌టీ, ఐ-జీఎస్‌టీ, యూటీ-జీఎస్‌టీ న్యాయ పరిహారం మొదలైనవి వాటిని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మార్చి 28న చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్‌టీ అమలైతే ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చట్టంలో ఉన్న వివిధ సెస్సులను రద్దు చేస్తారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన బిల్లులన్నీ జీఎస్‌టీ కిందకు వస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయాన్ని, ఇతర విషయాలపై రేపు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మార్చి 29 లేదా 30లోపు జీఎస్‌టీ బిల్లుకు సభ ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 12వరకూ జరగనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com