క్షమాబిక్ష కాలంలో స్వస్థలాలకు చేరుకొనేందుకు సహాయ డెస్కులు
- March 26, 2017
జెడ్డా : క్షమాబిక్ష అవకాశమున్నవారిని స్వస్థలాలకు పంపేందుకు సహాయ డెస్కులు ఏర్పాటుకు భారత దౌత్య మిషన్ సమాయుత్తమవుతుంది.కింగ్డమ్ లో వీసా నిబంధనలు ఉల్లంఘించినవారిపై సౌదీ అరేబియా కఠిన నిబంధనలను అమలుచేసే లోపున భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పలు సహాయక చర్యలను తీసుకోనున్నారు. .కింగ్డమ్ ను ఇక " ఉల్లంఘనలు లేని దేశంగా " మార్చుతున్నట్లుగా ప్రచారం అధికారికంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే బుధవారం నుండి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ నుండి వారికి సహాయ పడేందుకు సన్నద్ధమవుతుంది. ఆచరణాత్మకంగా చూస్తే భారతీయుల సంఖ్య హజ్ వీసా హోల్డర్లు కింగ్డమ్ మరియు ఉమ్రా లో ఎక్కువకాలం ఉండిపోయినవారు దాదాపు ఎవరూ లేరు . అయితే, ఒక భారతీయ అధికారిక గణాంకాల ప్రకారం, ఉపాధి వీసా ఉల్లంఘించినవారు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అహ్మద్ జావేద్ కాన్సుల్ జనరల్ మహమ్మద్ నూర్ రెహమాన్ షేక్ ఇరువురు రాయబారులు శనివారం కమ్యూనిటీ నాయకులు కలిశారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు ఏ సమస్యలు లేకుండా కింగ్డమ్ వదిలివెళ్లేందుకు తగిన సహాయం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. క్షమాబిక్ష కాలంలో వారు క్షేమంగా ఇంటికి పంపించే కాలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భారత జాతీయులకు ఆ అధికారులు పిలుపునిచ్చారు. జెడ్డా కాన్సులేట్ తెలిపిన సమాచారం ప్రకారం, రాయబార కార్యాలయంలో10 సహాయ డెస్కులు వారి పరిధిలోని వివిధ సంస్థానాలలో మరో12 సహాయం డెస్కులు వారి కోసం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







