బాలయ్య గ్యాంగ్ స్టర్ గా

- March 27, 2017 , by Maagulf
బాలయ్య గ్యాంగ్ స్టర్ గా

బాలకృష్ణ వందవ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో అని రకరకాల వార్తలు వినిపించాయి.. కృష్ణ వంశీ, రవికుమార్ వంటి దర్శకులు తెరపైకి వచ్చారు.. కానీ ఎవరూ ఊహించని విధంగా పూరీ బాలయ్య 101 సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను యూరప్ లో జరుపుకొనున్నది.. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ గురించి పూరి మాట్లాడుతూ.. బాల‌కృష్ణ‌గారిని నా సినిమాలో కొత్త‌గా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌. చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండే డైన‌మిక్ రోల్‌. ఆయ‌న డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాల‌కృష్ణ‌గారితో ఐదేళ్ళ క్రిత‌మే సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్ అనే హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేస్తాం. సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఆయ‌న చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం. అని పూరి చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com