సముద్ర తీరాలకు మంచి రోడ్లు అవసరం
- March 27, 2017
సముద్ర తీరానికి చేరుకునేందుకు మంచి రోడ్లు అవసరమని ఫిషర్‌మెన్ అభ్యర్థిస్తున్నారు. పలుమార్లు అథారిటీస్‌కి ఈ విషయమై విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండాపోయిందని వారుఆ వేదన వ్యక్తం చేశారు. జిదాలి తీరానికి చేరుకోవడం కష్ట సాధ్యంగా మారిందని, సరైన రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిషర్‌మెన్ చెప్పారు. తమ వాహనాలు ఇసుకలో కూరుకుపోవడం జరుగుతోందని వారు తమ పరిస్థితిని వివరించారు. సముద్రం మీద జీవనం సాగించే తమపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు ఆరోపించడం జరుగుతోంది. ఓ అధికారి తమపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తుండగా, అధికారులేమో సముద్ర తీర ప్రాంతాల్ని కలుషితం చేస్తున్నారనే ఆరోపణలతో ఫిషర్‌మెన్‌పై జరీమానాలు విధిస్తున్నారు. అయితే మునిసిపాలిటీ సిబ్బంది చెత్తను తీర ప్రాంతాల్లో పారవేస్తున్నారనీ దాన్ని తమ నేరంగా అధికారులు పరిగణిస్తున్నారని ఫిషర్‌మెన్ ఆరోపించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్ (తినడం, డ్రెస్ కోడ్ & ఇతర నిబంధనలు)
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









