వైద్యో నారాయణో హరి
- September 28, 2015
రాయలసీమ రతనాల సీమంటారు నిజమే,ఆ రతనాలలో మన తెలుగు రత్నం పేదల పాలిట పెన్నిది మా వలస జీవుల (గల్ఫ్ బ్రతుకుల) "ఆత్మ బందువు" కడప జిల్లా వాసి డా.వి.సురేష్ నాథ్ రెడ్డి గారు.మా రెడ్డి సారు గురించి ఈ ప్రపంచానికి తెలియలనేదే ఈ నా చిన్న ప్రయత్నం.
అందరిని ఆప్యాయంగా పలకరిస్తు,మనం చెప్పె సమస్యల్ని ఓపిగ్గా వింటుంటారు.డాక్టర్ గారు మాట్లాడే పద్దతి మరియు అతని పెదవిపై చిరునవ్వు చూస్తే మనలో వచ్చిన జబ్బు కూడ బయపడుతుంది,సగం రోగం నయమౌతుంది.అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వైద్యుడు మరియు మంచి మనసు గల మానవత మూర్తి.
ఒక్కసారి అనరోగ్యమని ఈ సార్ దగ్గరకు వెళ్ళాక,మన జబ్బు నయమయ్యే వరకు పూర్తి బాద్యత తీసుకోని,అమ్మలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తు మరియు నాన్నల మనో ధైర్నాన్ని ఇస్తు,దైవంల తన వైద్యాన్ని నిర్వహిస్తారు.
ఎదన్న సమస్య వచ్చి అర్థ రాత్రి ఫోన్ చేసిన చిరునవ్వుతో మాట్లాడుతు మన సమస్య విని ,సలహాలు సూచనలు ఇస్తారు. ఇక పేషంట్ల మాటకోస్తే ఈ సార్ దగ్గర చాల పెద్ద లైన్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళే కాకుండా వివిద దేశాల వారు కూడ చాల మంది వస్తుంటారు. బయం బయంగా హాస్పిటల్ కి వస్తారు కాని ఒక్కసారి సారుని కలిసాక నవ్వుతు హాస్పిటల్ నుండి బయటకు వస్తారు పేషంట్లు. అది మా డా.సురేష్ నాథ్ రెడ్డి గారి మాట తీరు. ఒక్క మాటలో చెప్పలంటే మనవత్వం కలిగిన మంచి మనషి.ఈ సారు తల్లితండ్రుల పాదాలకు నా వందనాలు.
ఈ సారుని మా వలస బ్రతుకుల కోసం ఆ వేములవాడ రాజన్న ఏడుకొండల వెంకన్న అబుధాబి పంపించారు మరి.
వైద్యో నారాయణ.
మీ శేఖర్.మల్యాల
(అబుధాబి) యూ.ఏ.ఈ
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







