వాహనదారులకు ఒమాన్ పోలీసుల హెచ్చరిక
- September 28, 2015
రాయల్ ఒమాన్ పోలీసులు, వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏటీఎంలలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు, చిన్న చిన్న షాపింగ్ కొరకు వెళుతూ, కార్ ఇంజన్ని ఆఫ్ చేయకపోవడం దొంగతనాలకు ఆస్కారం కల్పిస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు వాహనదారులకు చేసిన హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఒక్క నిమిషం అయినాసరే కార్ని నిలుపుదల చేసి కిందకు దిగాలనుకుంటే వెంటనే ఇంజన్ని ఆఫ్ చేసి, కార్ని లాక్ చేసుకోవాలని సూచించారు. వాహన దొంగతనాల్లో ఎక్కువగా మస్కట్లోనే జరుగుతున్నట్లు గుర్తించామనీ, చాలా కేసుల్లో డ్రైవర్ లేకుండా కార్ ఇంజన్ ఆన్ చేసి ఉంటోందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. దొంగతనం చేసేవారు అనుక్షణం గమనిస్తుంటారనీ, వాహనదారులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, దొంగలకు అవకాశమిచ్చినట్లేనన్నారు. కార్ డోర్ లాక్ చేయకపోవడం వల్ల వాటిల్లో విలువైన వస్తువులు దొంగిలించబడ్తున్నాయన్నారు పోలీసులు. కార్లను, వస్తువుల్ని దొంగలించి, బ్లాక్ మార్కెట్లో వాటిని అమ్మేస్తున్నారనీ, దొంగ వస్తువులు లేదా కార్లను అమ్మే స్క్రాప్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ, ఆర్టికల్ 279 ప్రకారం 3 నెలల నుంచి మూడేళ్ళ జైలుతోపాటు 10 నుంచి 500 ఒమాన్ రియాల్స్ జరిమానా కూడా విధించబడ్తుందని అన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







