వెంకటేష్ 'గురు' రివ్యూ ..
- March 31, 2017
సినిమా పేరు: 'గురు'
రిలీజ్ డేట్: 31-03-2017
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
ఫొటోగ్రఫీ: శక్తివేల్
స్టోరీ, స్క్రీన్ ప్లే: సుధ కొంగర
ప్రొడ్యూసర్: ఎస్.శశికాంత్
నిర్మాణం: వై నాట్ స్టూడియోస్
నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు. అనితా చౌదరి తదితరులు
పరిచయం: మరో సైడ్ ట్రాక్ లేకుండా కేవలం బాక్సింగ్ గేమ్ చుట్టూనే తిరిగే కథతో కోచ్ గా ఈ సారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు విక్టరీ వెంకటేష్. బాలీవుడ్ బంపర్ హిట్ మూవీ 'సాలా ఖర్దూస్' కి రీమేక్ అయిన ఈ సినిమాని మణిరత్నం శిష్యురాలు సుధా కొంగర డైరెక్ట్ చేశారు.
బాలీవుడ్ మూవీ సాలాఖర్దూస్ ని కూడా సుధానే తెరకెక్కించారు. నిజానికి సాలా ఖర్దూస్ కథను ముందుగా ఆమె వెంకటేష్ కు వినిపించారు. అయితే, కథ బావుంది కాని తాను చేయనని చేతులెత్తేశాడు వెంకీ. సాలా ఖర్దూస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత వెంకీ చూపు సుధ వైపు మళ్లింది. తెలుగులో తాను ఈ సినిమా చేస్తానని చెప్పడంతో సుధా కొంగరే తెలుగు వెర్షన్ కు కూడా డైరెక్ట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీ వెర్షన్( సాలా ఖర్దూస్) లో బాక్సింగ్ క్రీడాకారిణిగా కనిపించిన రితికా సింగ్ తెలుగులోనూ అదే పాత్ర చేయగా, మాధవన్ రోల్ ని వెంకటేష్ చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
స్టోరీ: ఆదిత్య(వెంకటేష్) ఆశ, శ్వాస బాక్సింగ్. అయితే, కోపం ముక్కుమీదే ఉంటుంది. అదే అతడనుకున్న లక్ష్యాన్ని చేరకుండా చేస్తుంది. బాక్సింగ్ అకాడమీలో కోచ్ గా నియామకమైనా అక్కడి రాజకీయాలతో విభేదించడంతో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. దీంతో, ఆదిత్యని ప్రాముఖ్యత లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్ కోచ్‌గా అకాడమీ నియమిస్తుంది. ఈ క్రమంలో రాములు (రితికా సింగ్) వెంకీ కంట పడుతుంది. మత్స్యకారుల కుటుంబానికి చెందిన రాములు కూరగాయలు అమ్ముకుంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తుంటుంది. అక్క లక్స్ (ముంతాజ్) మాత్రం బాక్సర్‌గా రాణించి తద్వారా పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈమెలో ఓ మంచి బాక్సర్ దాగుందని గుర్తించి, దానికి మెరుగులు దిద్దితే భారత్‌కు పతకాలు సాధించి పెడుతుందని బలంగా నమ్ముతాడు ఆది. అయితే, రాములు మాత్రం కేవలం డబ్బు కోసమే కోచింగ్ తీసుకొంటుంది. కోచ్ ని చులకనగా చూడ్డంతోపాటు, కావాలనే మ్యాచ్‌లు ఓడిపోతుంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆది చాంపియన్ డ్రీం ఎలా సాధ్యమైందన్నదే సినిమా.
విశ్లేషణ : రీమేక్ సినిమాగా తెరకెక్కిన 'గురు' భారీ మార్పులూ లేకుండా ఒరిజినల్ వర్షన్ లానే తెలుగులో తెరకెక్కింది. బాక్సింగ్ ఛాంపియన్ అంటే అస్సలు ఆసక్తిలేని ఓ కూరగాయలు అమ్ముకొనే అమ్మాయిని బాక్సింగ్ బరిలో దింపడానికి కోచ్ పడిన కష్టం కళ్లకు కడుతుంది ఈ సినిమా. అతని లక్ష్యాన్ని, నిజాయతీని శంకిస్తూ ఉండే శిష్యురాలి మీద కోపం కట్టలు తెంచుకున్నా ఎలా ఛాంపియన్ ని చేశాడన్నది హైలైట్ అనే చెప్పాలి. అక్కడక్కడ ఎమోషనల్ టచ్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది. ఓ అమ్మాయి బాక్సింగ్ చాంపియన్ కావాలంటే ఎంతమంది కళ్లనుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయో కూడా డైరెక్టర్ ఈ సినిమాలో చూపించింది. కోచ్ రోల్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. దీనిలో వెంకటేష్ 100 పర్సంట్ ఫిట్ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో అసలు లీడ్ రోల్ చేసిన రితికా సింగ్ అల్లరి, కోపం, పంతం, థైర్యం సినిమాని రక్తికట్టించాయి. నాజర్, భరణి, రఘుబాబు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. పాటలు మాదిరిగా అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. మొత్తంగా కథా నేపథ్యం, వెంకటేష్, రితికాసింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అనుకుంటే, సాలా ఖర్దూస్ చూస్తు పెద్దగా గురు కిక్ ఇవ్వదు. లేదంటే మాత్రం ఓ సారి చూడొచ్చు గురూ అనేలా ఉంటుంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







