జరిమానా ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్‌ చేసినందుకు

- April 01, 2017 , by Maagulf
జరిమానా ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్‌ చేసినందుకు

- రూ.3.2 కోట్ల జరిమానా ! 
ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్‌ రాసిన ఓ మహిళను నార్త్‌ కరోలినా న్యాయస్థానం దోషిగా తేల్చింది. వ్యక్తి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన దోషికి 5,00,000 డాలర్లు ( రూ.3.2 కోట్లు ) జరిమానా విధించినట్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...తన మిత్రుడే తన కుమారున్ని హతమార్చాడని యాష్‌విల్లేకి చెందిన జాక్వెలిన్‌ హమ్మన్డ్‌ అనే మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై ఆమె మిత్రుడు డైల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హమ్మన్డ్‌ వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అన్నాడు. నార్త్‌ కరోలినా కోర్టులో పరువునష్టం దావా వేశాడు.
కేసును విచారించిన న్యాయమూర్తి హమ్మన్డ్‌ను దోషిగా తేల్చింది. ఐదు లక్షల డాలర్ల జరిమానా చెల్లించాలని హమ్మన్డ్‌ను ఆదేశించగా, దానికి ఆమె అంగీకరించింది. 
కాగా, హమ్మన్డ్‌, డైల్‌ గతంలో ఓ రేడియోకు పనిచేసేవాళ్లు. అయితే, ఆ రేడియో సంస్థ నిర్వహణ వ్యవహారంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. రెండేండ్ల క్రితం డైల్‌ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ మరణవార్తకు సంబంధించి హమ్మండ్‌ రాసిన పోస్ట్‌ వివాదాస్పదమైంది. దానిపై డైల్‌ కేసు వేయడంతో జడ్జి ఈ తీర్పును ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com