కతర్ లో 67 మంది భారతీయుల మృతి

- April 03, 2017 , by Maagulf
కతర్ లో 67 మంది భారతీయుల మృతి

ఈ ఏడాది మొత్తం 67 మంది భారతీయులు మృతి చెందినట్లు దోహాలోని ఇండియన్‌ ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. కమ్యూనిటీ హౌస్‌ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మార్చి 29 వరకు నమోదైన మరణాల సంఖ్య ఇది. సెంట్రల్‌ ప్రిజన్‌లో 180 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తుండగా, 80 మంది డిపోర్టేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం డిపోర్టేషన్‌కి సంబంధించి అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఇంకో వైపున లేబర్‌ అండ్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెక్షన్‌ - ఎంబసీ మొత్తం 674 ఫిర్యాదుల్ని మార్చి 30 వరకు అందుకుంది. ఇందులో 514 ఫిర్యాదుల్ని పరిష్కరించగా, 69 ఇంకా ఫాలో అప్‌లో ఉన్నాయి. కమ్యూనిటీ హౌస్‌ కార్యక్రమంలో అంబాసిడర్‌ పి కుమారన్‌, డిప్యూటీ చాఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఆర్‌కె సింగ్‌ మరికొందరు అధికారులు హాజరయ్యారు. ఇండియన్‌ కమ్యూనిటీ బెనెవోలెంట్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ డేవిస్‌ ఎడాకాలాతూర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com