భారత ఐటీకి సింగపూర్ షాక్

- April 03, 2017 , by Maagulf
భారత ఐటీకి సింగపూర్ షాక్

భారత ఐటీ సంస్థలు, ప్రొఫెనల్స్‌ వీసాలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం నడుస్తోంది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భావిస్తున్న భారత ప్రభుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃసమీక్షపై పునరాలోచన చేస్తోంది.
సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, ఎల్ అండ్ టీ కంపెనీలపై ప్రభావం చూపనుంది.
ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా.. గత సంవత్సరం మొదటి నుంచీ వీసాల జారీని గణనీయంగా తగ్గించారని, స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం కంపెనీలకు స్పష్టంచేసిందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వెల్లడించారు.
ఎకనామిక్ నీడ్స్ టెస్ట్ అంటూ ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ సింగపూర్ భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు వీసాలను నిరాకరిస్తోంది. సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఓ భారత అధికారి తెలిపారు. అమెరికా, తర్వాత సింగపూర్ కూడా వీసాలు తగ్గించడంపై భారత ఐటీ సంస్థలు, ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com