బరిలోకి దిగిన మెగాస్టార్..!
- September 28, 2015
ఎప్పుడెప్పుడు బ్రూస్ లీ సినిమా సెట్ లో చిరంజీవి.. ఎంటర్ అవుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఆల్రెడీ మెగాస్టార్... బ్రూస్ లీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని రామ్ చరణే కన్ఫమ్ చేశాడు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు చిరంజీవి. ఏడేళ్లక్రితం రాజకీయరంగ ప్రవేశంతో.. నటనకు విరామం ప్రకటించిన చిరంజీవి.. తన కొడుకు రామ్ చరణ్ కోసం.. కాసేపు మగధీర సినిమాలో కనిపించారప్పుడు. మళ్లీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతోనే తిరిగి సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు మెగాస్టార్. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ సినిమాలో కాసేపు అతిథి పాత్రలో కన్పించబోతున్నారు చిరంజీవి. చివరిదశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ లోగా.. ఈ సోమవారం నుంచి చిరంజీవి కూడా పాల్గొంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మూడు రోజుల పాటు చిరంజీవికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరగబోతున్నట్టు ఇప్పటికే దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకూ ఈ షూటింగ్ జరగనుంది. సినిమాలో చిరంజీవి కేవలం మూడు నిమిషాల పాటే కనిపిస్తారని యూనిట్ సభ్యులు చెప్పారు... ఈ మూడు నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో చిరంజీవి, కొందరు ఫైటర్స్ పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు... అక్టోబర్-2న ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరు నటిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ కేవలం 150 వ సినిమాకు టీజర్ మాత్రమేనన్న రామ్ చరణ్... తండ్రితో షూటింగ్ చాలా సంతోషంగా ఉందని.. బ్రూస్ లీ చిత్రంలో భాగమైనందుకు ఫుల్ హ్యాపీ అంటూ మెగాస్టార్ కు స్వాగతం పలికాడు. రామ్ చరణ్ తొలిచిత్రం చిరుత విడుదలైన సెప్టెంబర్-28నే.. చిరంజీవి మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడం విశేషం. ఇక గతంలో రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మరి.. బ్రూస్ లీ విషయంలోనూ ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూద్దాం..!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







