పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి

- April 05, 2017 , by Maagulf
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ వాహనం సమీపంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు సైనికులు సహా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మరో 14 మంది గాయపడినట్లు పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధది మాలిక్‌ అహ్మద్‌ ఖాన్‌ వెల్లడించారు. సమాచారమందుకున్న సహాయక బృంద సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని విస్త్రత తనిఖీలు చేపట్టారు.
ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడిపై ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రకటనలు వెలువడలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com