అమెరికాలో ఎస్పీ షాక్ ఇచ్చిన దొంగలు..!
- April 05, 2017
తెలుగు ఇండస్ట్రీలో గాన గంధర్వుడు గా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మద్య పలు మార్లు వార్తల్లో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఆ మద్య బాలుకి సంగీత మాంత్రికుడు ఇళయరాజకు పెద్ద వైరమే జరిగింది. ఆ మద్య తెలుగు సినిమాలపై తనదైన స్టైల్లో స్పీచ్ దంచికొట్టారు. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరోసారి వార్తల్లోకి ఎక్కారు..అయితే ఈసారి మాత్రం ఎలాంటి కాంట్రవర్సీతో కాదు..ఆయన బ్యాగు పోగొట్టుకున్న బాధ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు చేదు అనుభవం ఎదురైంది. హూస్టన్ లో 'ఎస్పీబీ 50' టూర్ లో ఉండగా ఆయన బ్యాగ్ చోరీకి గురైనట్టు ఆయన ఫేస్ బుక్ లో పెట్టారు.
ఆ బ్యాగు లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులూ ఉన్నాయన్నారు. కాకపోతే సమయానికి హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో డూప్లికేట్ పాస్ పోర్టును పొందానని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానుల ఆందోళన చెందారని కాకపోతే ఇప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. 'యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.. గాడ్ బ్లెస్ యూ ఆల్' అని ఎస్పీబీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, సియాటిల్, లాస్ ఏంజిల్స్, అట్లాంటాలో బాలు ప్రస్తుతం పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







