2 మిలియన్‌ ఖురాన్‌లను పంచిన సౌదీ అరేబియా

- September 29, 2015 , by Maagulf
2 మిలియన్‌ ఖురాన్‌లను పంచిన సౌదీ అరేబియా

హజ్‌ యాత్ర ముగించుకుని, స్వదేశాలకు తిరిగి వెళుతున్నవారికి సౌదీ ప్రభుత్వం పవిత్ర మసీదుల తరఫున 2 మిలియన్‌ ఖురాన్‌లను పంపిణీ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌, ఎండోమెంట్స్‌, దావా మరియు గైడెన్స్‌ బ్రాంచ్‌ ఇన్‌ మక్కా మరియు ఖురాన్‌ పంపిణీ కమిటీ ఛైర్మన్‌ షేక్‌ తలాల్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ అఖీల్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎయిర్‌పోర్ట్‌ మరియు ఇస్లామిక్‌ పోర్ట్‌ ఆఫ్‌ జెడ్డా మరియు సరిహద్దుల్లోనూ ఖురాన్‌లను పంపినీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉర్దు, హౌసా, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, థాయ్‌, ఇండోనేసియన్‌, చైనీస్‌, స్పానిష్‌, మల్బరీ, రష్యన్‌, టర్కిష్‌, జర్మన్‌ మరియు అల్బేనియన్‌ తదితర 13 భాషల్లో ఖురాన్‌ని భక్తులకు అందజేసినట్లు షేక్‌ అల్‌ అఖీల్‌ చెప్పారు. 

 

--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com