బుల్లితెర ప్రసారాల్లోను దూసుకుపోతున్న బాహుబలి..!!
- September 29, 2015
టాలీవుడ్ చరిత్రను తిరగ రాయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ ను కురిపించుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేసిన 'బాహుబలి' మరో చరిత్రను సృస్టించబోతోంది. ప్రముఖ మాటివి ఛానల్ 'బాహుబలి' బుల్లితెర ప్రసార హక్కులను 20 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమాను అక్టోబర్ 25వ తారీఖున దసరా ప్రీమియర్ షోగా బుల్లితెర పై ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాను ప్రసారం చేస్తున్న మాటివి ఈసినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ కు 10 సెకండ్లకు 2.5 లక్షల టెలికాస్టింగ్ ఫీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి యాడ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు బుల్లితెర చరిత్రలో ఏ సినిమా పై ప్రయోగించలేదని టాక్. ఈ యాడ్ టరీఫ్ కు చాల మల్టీ నేషనల్ కంపెనీలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా బుల్లితెర పై ప్రీమియర్ షోగా ప్రదర్శింప బడుతున్న నేపధ్యంలో ఈసినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల 'బాహుబలి' షూటింగ్ అనుభవాల క్లిపింగ్స్ ను కూడ ఈ ప్రీమియర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారుస్తారని టాక్. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా 'బాహుబలి' లో భాల్లాలదేవ పాత్రను పోషించిన రానా తన సొంత నిర్మాణ సంస్థలో రాబోతున్న నవంబర్ నుండి దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో 'బాహుబలి 2' ప్రారంభం ఇంకా ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ వార్తలే నిజం అయితే 'బాహుబలి 2' కనీసం వచ్చే సంవత్సరం అక్టోబర్, నవంబర్ ప్రాంతాలకైనా విడుదల అవుతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈసినిమా హిందీ వెర్షన్ కు సంబంధించి కరణ్ జోహార్ పాత్ర ఉండటంతో అంత ఆలస్యాన్ని కరణ్ జోహార్ అంగీకరించడు అనే వార్తలు కూడ ఉన్నాయి. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా 'బాహుబలి' లో భాల్లాలదేవ పాత్రను పోషించిన రానా తన సొంత నిర్మాణ సంస్థలో రాబోతున్న నవంబర్ నుండి దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో 'బాహుబలి 2' ప్రారంభం ఇంకా ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ వార్తలే నిజం అయితే 'బాహుబలి 2' కనీసం వచ్చే సంవత్సరం అక్టోబర్, నవంబర్ ప్రాంతాలకైనా విడుదల అవుతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈసినిమా హిందీ వెర్షన్ కు సంబంధించి కరణ్ జోహార్ పాత్ర ఉండటంతో అంత ఆలస్యాన్ని కరణ్ జోహార్ అంగీకరించడు అనే వార్తలు కూడ ఉన్నాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







