యూఏఈ రెసిడెంట్స్‌కి ఉచిత హెల్త్ చెకప్
- April 06, 2017
వరల్డ్ హెల్త్ ఆన్గనైజేషన్ - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడిక్లినిక్ మిడిల్ ఈస్ట్, ఉచిత వైద్య పరీక్షల్ని అందించింది. బ్లడ్ కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బిఎంఐ, బ్లడ్ ప్రెజర్ పరీక్షల్ని యూఏఈ రెసిడెంట్స్‌కి ఏప్రిల్ 5న నిర్వహించింది. ఈఏడాది 'డిప్రెషన్ - లెట్స్ టాక్' అనే థీమ్‌తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డిప్రెషన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో డిప్రెషన్ మీద ఫోకస్ పెట్టామని నిర్వాహకులు తెలిపారు. డిప్రెషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలనీ, ఇది రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిథులు, వైద్యులు తెలిపారు. మెడి క్లినిక్ మిడిల్ ఈస్ట్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ పెటీ లౌబ్‌సెర్ మాట్లాడుతూ, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలనీ, అలాగే కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్‌తో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని సూచించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







