సాయిధర్మతేజ్, సందీప్ కిషన్, కృష్ణ వంశీల 'నక్షత్రం'
- April 07, 2017
తెలుగు తెరపై సామాజిక నేపద్యం ఉన్న క్రియేటివ్ దర్శకుడిగా... కృష్ణవంశీ కి మంచి పేరున్నది.. కానీ కృష్ణ వంశీ కలం పదును తగ్గిందో.. కధలో కొత్తదనం లోపించిందో .. గతకొంత కాలంగా ఫామ్ ని కోల్పోయాడు.. రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ అవకాశంను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.. కాగా కృష్ణ వంశీ నక్షత్రం అనే సినిమాను యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు.. సందీప్ కిషన్ పోలీస్ గా రూపొందుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. నిడివి రెండున్నర గంటల వరకూ వచ్చిందట.. కధలో మరింత వేగం ఉండేలా.. రెండు గంటల నిడివి ఉండేలా సినిమాను కృష్ణ వంశీ ఎడిటింగ్ చేయిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా చూస్తారని ఈ నిర్ణయం తీసుకొన్నారట.. ఈ రెండు గంటల సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సాయి ధరం తేజ్ 40 నిమిషాలు కనిపించనున్నాడట.. ప్రకాష్ రాజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, మానస్ లు నక్షత్రంలో మెరుస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







