క్షమాబిక్ష: ఎయిర్ ఇండియా 50 శాతం డిస్కౌంట్
- April 08, 2017
రియాద్: క్షమాభిక్ష కోసం నమోదు చేసుకున్నవారికి 50 శాతం డిస్కౌంట్‌తో కూడిన ప్రయాణ ధరల్ని ప్రకటించింది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా సీనియర్ ఎజిఎం కుందన్ లాల్ కొత్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్షమాభిక్ష సమయంలో ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని ఆయన వివరించారు. రియాద్, జెడ్డా, దమ్మమ్ నుంచి ఇండియాలోని పలు ప్రాంతాలకు సుమారుగా 500 సౌదీ రియాల్స్ (వీటికి ట్యాక్స్‌లు అదనం), రియాద్, జెడ్డా, దమ్మమ్ నుంచి ఢిల్లీకి 659 సౌది రియాల్స్, ఇతర డెస్టినేషన్స్‌కి 595 సౌదీ రియాల్స్ ధర నిర్ణయించారు. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి 40 కిలోల చెక్‌డ్ ఇన్ బ్యాగేజీని రియాద్, మరియు జెడ్డాల నుంచి, అలాగే దమ్మమ్ నుంచి 30 కిలోల బ్యాగేజీని ప్రయాణీకులకు అనుమతిస్తారు. ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ నుంచి ఇచ్చే ఎమర్జన్సీ సర్టిఫికెట్‌ని లేదా పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే ఫైనల్ ఎగ్జిట్ వీసా చూపించి ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. హిందూస్తానీ బజ్మీ ఉర్దు ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎయిర్ ఇండియాకి అలాగే, కుందన్‌లాల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, మరియు బ్లూ క్లార్ ఉద్యోగుల కోసం ఈ తగ్గింపు ధరల విమానయానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







