రూ.800 తగ్గిన వెండి ధర
- April 08, 2017
వెండి ధర నేత చూపులు చూస్తోంది. శనివారం ఢిల్లీలో కిలో రజతం ధర 800 రూపాయలు తగ్గి 41,750 రూపాయల స్థాయికి చేరింది. కోల్‌కతా మార్కెట్లోనూ కిలో వెండి ధర 42,000 రూపాయల నుంచి 41,650 రూపాయలకు దిగొచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లలోనూ కిలో వెండి ధర 42,600 రూపాయల నుంచి 41,900 రూపాయల స్థాయికి పడిపోయింది. . నాణేల తయారీదారులు, పారిశ్రామిక వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గడంతో వెండి ధర నేల చూపులు చూస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండికి పెద్దగా డిమాండ్ లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
స్థిరంగా పసిడి ధర
వెండి ధర తగ్గుతుంటే..
పసిడి ధర మాత్రం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర 29,300 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం 29,230 రూపాయలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం, శనివారం రూ.150 తగ్గి 29,080 రూపాయలకు చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







