భారీ ఆయుధ డంప్‌లు స్వాధీనం ఫ్రాన్స్‌లో

- April 08, 2017 , by Maagulf
భారీ ఆయుధ డంప్‌లు స్వాధీనం ఫ్రాన్స్‌లో

ఫ్రాన్స్‌ పోలీసులు భారీ ఆయుధ డంపులను స్వాధీనం చేసుకున్నారు. బాసిక్యూ వేర్పాటువాద సంస్థ ఎటాకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పదం జరగడంతో ఈ ఆయుధాలను అప్పగించారు. మొత్తం ఎనిమిది డంపులను స్వాధీనం చేసుకున్న అధికారులు 3.5టన్నుల ఆయుధాలను గుర్తించారు. ఫ్రాన్స్‌ ప్రధాని బెర్నార్డ్‌ కాజినోవ్‌ మాట్లాడుతూ ఈ ఆయుధాలను ధ్వంసం చేస్తామని తెలిపారు. ఎటా నాయకులు మాట్లాడుతూ తమ ఆయుధాలను మొత్తం ప్రభుత్వానికి అప్పజెప్పామన్నారు.
ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో కొంత భాగంతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఎటా సంస్థ దాదాపు 40ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తోంది. ఈ ఉద్యమంలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎటా సంస్థ 2011లో కాల్పుల విరమణ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com