చైనా సాయం కెన్యా కరువు బాధితులకు
- April 08, 2017
- 144 టన్నుల ఆహార పదార్థాలు అందచేత
కెన్యాలో నివసిస్తున్న చైనీయులు అక్కడి కరువు బాధితులకు 144 టన్నుల ఆహార పదార్థాలను స్వచ్ఛందంగా అందించారు. కెన్యాలోని దాదాపు 9 రాష్ట్రాలలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
దీంతో తమ వంతు సహాయంగా కెన్యాలో నివసిస్తున్న చైనీయులు వారికి అవసరమైన వంట నూనె, మొక్కజొన్న, గోథుమ పిండి తదితరాలను అందించారు. కెన్యాలోని దౌత్య కార్యాలయంతో కలిసి కెన్యా-చైనా ఆర్థిక, వాణిజ్య అసోసియేషన్, ద కెన్యా ఓవర్సీజ్ చైనీస్ అసోసియేషన్లు 160 వేల డాలర్ల విరాళాన్ని సహాయంగా అందించాయి. కెన్యాలో 3 మిలియన్ల ప్రజలు కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అంచనా. సమయానికి స్పందించి సహాయం చేసిన చైనా జాతీయులను కెన్యా సహకార పునరావాస మరియు ప్రణాళికా మంత్రిత్వ శాఖ కార్యదర్శి జోసెఫ్టా ముకోబే ప్రశంసించారు.
కరువు బాధితులకు అత్యవసర ఆహార సహాయం అవసరమని కెన్యా అధ్యక్షులు విజ్ఞప్తి చేసిందే తడవుగా ఇక్కడ నివసిస్తున్న చైనీయులు స్పందించారని ఆమె తెలిపారు. వాతావరణ మార్పు కారణంగా కెన్యాలో తరుచూ సంభవిస్తున్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో దీర్ఘకాల పరిష్కారానికై చైనాకు చెందిన నిపుణుల సహాయం తీసుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. కెన్యాకు, చైనాకు సంబంధాలు వన్‌వే ట్రాఫిక్ వంటివని ఆమె అభివర్ణించారు. కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై చైనా నుంచి కెన్యా పాఠాలు నేర్చుకుంటుందని, అదే విధంగా ఈ అంశంలో తమ అనుభవాల నుంచి చైనా కొన్ని పాఠాలు నేర్చుకుంటుందని ముకోబె తెలిపారు.
కెన్యాలోని చైనీయులు కరువు బాధితులకు అందించిన సహాయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కెన్యాకు చైనా దౌత్యాధికారి లియు జియన్ఫా, కెన్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని చైనా కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







