ఔత్సాహికులకు ఖతార్ రైల్ ఆహ్వానం
- September 30, 2015
ఖతార్ రైల్వే కంపెనీ (ఖతార్ రైల్), నిర్మాణ రంగంలో అవకాశాల కోసం అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించింది. దోహా మెట్రో స్టేషన్ పనులకు సంబంధించి, స్థానికంగా ఉన్న ఔత్సాహిక సరఫరాదారులను భాగస్వాముల్ని చేసేందుకు ఈ అవేర్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 180 మంది సామర్థ్యం కల భాగస్వాములు, సరఫరాదారులతో 'దోహా మెట్రో ఆర్కిటెక్చరల్ ఫినిషస్' పేరుతో నిర్వహించిన అవేర్‌నెస్ క్యాంప్‌ని ప్లాన్ చేయడం జరిగింది. పాల్గొనే ఔత్సాహికులు సలహాలు, సూచనల్ని ఇతరులతో పంచుకోవడం, అదే విధంగా తెలుసుకోవడం ఈ వేదిక లక్ష్యం. ఖతార్ రైల్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మరియు ప్రొక్యూర్‌మెంట్ కల్దూన్ ట్రూమన్, నిర్మాణదారు ఎంపిక, మెకానిజం, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు వంటి వాటి గురించి తెలియజేశారు. ఖతార్ రైల్‌కి చెందిన సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు ఎంఈపీ మహమ్మద్ టింబర్లీ మెట్రో రైలుకు సంబంధించిన సరుకు, మరియు అలంకరణ, సాంకేతిక పరమైన అంశాలు మరియు అవసరాల గురించి వివరించారు. ఖతార్ రైల్, స్థానిక నిర్మాణదారులు, సరఫరాదారులతో స్నేహ సంబంధాలు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. 2018 నాటికి 37 స్టేషన్లతో మెట్రో రైలు ప్రారంభించనున్నారు. 2030 నాటికి 72 స్టేషన్లకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరించనుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







