బాలీవుడ్ చిత్రం 'నామ్ షబానా'పై పాకిస్తాన్ లో నిషేధం
- April 09, 2017
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'నామ్ షబానా' చిత్రంపై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించకుండానే చిత్ర ప్రదర్శన చేస్తున్నందుకు గాను సెన్సార్ బోర్టు ఈ సినిమాను బ్యాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే పాక్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉగ్రవాదానికి సంబంధించినవిగా ఉన్నాయని, అందుకే సినిమా ప్రదర్శన నిలిపి వేస్తున్నట్లు సెన్సార్ అధికారులు తెలిపారు. ఉరి ఉగ్రదాడి అనంతరం ఇండియన్ సినిమాలను పాక్‌లో నిషేదించారు. తర్వాత కొద్ది కాలానికి ఈ నిషేదం ఎత్తి వేశారు.
2015లో వచ్చిన 'బేబి' చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా 'బేబి'కి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ అతిథి పాత్రలో కనిపించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









