ఇన్ కమ్ ట్యాక్స్ సౌదీలకు ఎత్తివేత

- April 10, 2017 , by Maagulf
ఇన్ కమ్ ట్యాక్స్ సౌదీలకు ఎత్తివేత

మార్కెట్లో ఏ వస్తువు కొన్నా దానిపై ఎంతో కొంత పన్ను ఉంటుంది. దీనికి తోడు మన ఆదాయానికి కూడా పన్ను కట్టాల్సిందే. ఇలా ఏదో ఒక రూపంలో సగటు పౌరుడు ప్రభుత్వాన్ని పన్నులు చెల్లిస్తూనే ఉంటాడు. అయితే పన్నుల విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సౌదీ పౌరులు ఆదాయపు పన్ను కట్టనవసరం లేదంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
సౌదీ ప్రజలకు ఆదాయపు పన్ను ఉండబోదని, సౌదీ కంపెనీలు కూడా తమ లాభాల్లో పన్నులు చెల్లించనవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలచేపట్టిన ఆర్థిక సంస్కరణల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2014 నుంచి సౌదీలో ఆయిల్‌ ధరలు పతనమవడంతో అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ప్రయివేటీకరణ లాంటి మార్పులు చేర్పులు చేపట్టింది. దీంతో పాటు వ్యాట్‌పై కూడా ప్రజలకు ఉపశమనం కలిగించింది. 2020 సంవత్సరం వరకు వ్యాల్యూ ఆడెడ్‌ ట్యాక్స్‌ను 5శాతం కంటే ఎక్కువ పెంచబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల వసూలు చేసేందుకు పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయడం, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం లాంటివి సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com