సాయం కోసం భారతీయ వలసదారుడి ఎదురుచూపు

- April 10, 2017 , by Maagulf
సాయం కోసం భారతీయ వలసదారుడి ఎదురుచూపు

32 ఏళ్ళుగా బహ్రెయిన్‌లో ఉంటోన్న భారతీయ వలసదారుడొకరు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తనకు ఎవరైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 62 ఏళ్ళ అలౌసియాస్‌, ఇండియాకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాననీ, అయితే ఇక్కడ తనకు కొన్ని అప్పులు ఉన్నాయని అంటున్నారు. భారతదేశంలో ఉన్న తన కుటుంబానికి మెరుగైన జీవనం అందించడం కోసం మూడు దశాబ్దాల క్రితం బహ్రెయిన్‌కి వచ్చాననీ, మొదట్లో కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేసిన తనకు అంతా బాగానే ఉందనీ అయితే అనుకోని కారణాలతో బిజినెస్‌ డల్‌ అవడంతో ఆర్థికంగా చితికిపోయాననీ, అనారోగ్యంతో బతుకునీడ్చలేకపోతున్నానని, ఏ పనీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారాయన. ట్రావెల్‌ బ్యాన్‌ నుంచి తప్పించుకోడానికి 3400 బహ్రెయినీ దినార్స్‌ తాను చెల్లించవలసి ఉందని ఆయన అంటున్నారు. ఇంకో వైపున ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ నుంచి ఆయన దీనగాధకు స్పందన వచ్చిందని ఇప్పటివరకు 600 బహ్రెయినీ దినార్స్‌ సేకరించామని, మొత్తం సొమ్ముని సేకరించి, ఆయన్ని ఆదుకుంటామని ఐసిఆర్‌ఎఫ్‌ వలంటీర్‌ సయ్యద్‌ హనీఫ్‌ చెప్పారు. బాధితుడు ప్రస్తుతం ఆహారం సైతం సేకరించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com