తొలిసారిగా ఇంగ్లాండ్ నుంచి చైనాకు రైలు ప్రారంభం
- April 10, 2017
ఇంగ్లండ్ నుంచి చైనాకు తొలిసారిగా సరకు రవాణా రైలు ప్రారంభమైంది. ఈ రైలు ఏడు దేశాలను దాటుకుంటూ 75వేల మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. లండన్‌కు సమీపంలోని ఎస్సెక్స్ నుంచి రైలు సోమవారం ప్రారంభ మైంది. 30 కంటెయినర్లు ఉన్న ఈ రైలులో విస్కీ, శీతల పానీయాలు, విటమిన్స్, ఔషధాలు సహా పలు బ్రిటిష్ కంపెనీల ఉత్పత్తులను చైనాకు సరఫరా చేస్తున్నారు. ఎస్సెక్స్ నుంచి ఈ రైలు 17 రోజుల పాటు 75వేల మైళ్లు ప్రయాణించి చైనాలోని యివు ప్రాంతానికి చేరుకుంటుంది. జేజియాంగ్ ప్రావిన్స్‌లోని యివు ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్. ఈ రైలు ఏడు దేశాల గుండా ప్రయా ణిస్తుంది. ఫ్రాన్స్, బెల్జి యం, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజక ిస్థాన్ల మీదుగా ప్రయా ణించి చివర్లో చైనాకు చేరుకుంటుంది. సోమవారం ప్రారంభమైన రైలు ఏప్రిల్ 27న యివు చేరుకోవాల్సి ఉంది. మూడు నెలల క్రితమే చైనా నుంచి యూకేకు తొలి సరుకు రవాణా రైలు వెళ్లింది. ప్రస్తుతం యూకే నుంచి చైనాకు వెళ్తొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







