సౌదీ ఎడారిలో మృత్యువాత: తెలుగువ్యక్తి దీనగాధ
- April 10, 2017
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోగల మెదక్ జిల్లాకి చెందిన మన్నెల రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో హృదయ విదారక స్థితిలో మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ అతను మృతి చెందిన రెండేళ్ళ తర్వాత అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాములు చనిపోయిన తర్వాత 8 నెలలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్ళిన రాములు, కొన్ని కారణాలతో అనుకున్న ఉద్యోగం కాకుండా పశువుల కాపరిగా పనిచేయాల్సి వచ్చింది. ఎడారిలో పశువులను కాస్తుండగా తీవ్రమైన డీహైడ్రేషన్‌తో అక్కడే కుప్పకూలిపోయాడు. 2016 ఫిబ్రవరి 1న మరో ఆఫ్రికాకి చెందిన మరో పశువుల కాపరి, రాములు మృతదేహాన్ని గుర్తించాడు. అప్పటికే రాములు మృతదేహం చాలావరకు డీ కంపోజ్ అయిపోయింది. ఆఫ్రికా పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విచారణ చేపట్టి మృతుడిని గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే రాములు కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. రాములు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు వారు చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో చివరికి, అక్కడే బురైదాలో రాములు మృతదేహాన్ని ఖననం చేశారు.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







