హీరో హీరోయిన్లు చెవిటి, మూగగా సుకుమార్ కొత్త సినిమా

- April 10, 2017 , by Maagulf
హీరో హీరోయిన్లు చెవిటి, మూగగా సుకుమార్ కొత్త సినిమా

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా గ్రామీణ నేపద్యం లో రూపొందుతున్నందున సినిమా షూటింగ్ ఎక్కువ భాగం గోదావరి జిల్లాల్లో జరుపుకొంటున్నది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా లోని రామ్ చరణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ సాదాసీదా యువకుడిగా.. గళ్ళ లుంగీ, గుబురు గెడ్డం.. బనీన్ ధరించి పడవ నడుపుకొనే ఓ సామాన్య యువకుడిగా ఉన్నాడు.. 1980 నాటి బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిగా.. సమంత మూగ అమ్మాయిలా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.. కాగా సుకుమార్ సినిమా అంటేనే లెక్కలు, ఫిజిక్స్.. లతో ఉండి ప్రేక్షకులకు ఫజిల్ వంటిది అని అందరి అభిప్రాయం.. కానీ ఈ ఫోటోలో రామ్ చరణ్ ని చూస్తుంటే.. ఎటువంటి లెక్కలు చిక్కులు లేని సాదాసీదా పల్లెటూరు నేపద్య సినిమా గా అనిపిస్తుంది. పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ చరణ్ తో ఇటువంటి కొత్త తరహా సినిమా చేస్తున్న సుకుమార్ కూడా తన జోనర్ ను వదిలి పూర్తి స్థాయిలో గ్రామీణ అందాలను.. అప్పట్లో ఉన్న ప్రేమను వెండి తెరపై ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com