100 మంది కళాకారులకు తలా కాసు బంగారం అందించనున్న విజయ్ సేతుపతి

- April 10, 2017 , by Maagulf
100 మంది కళాకారులకు తలా కాసు బంగారం అందించనున్న విజయ్ సేతుపతి

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ఓ సంచలనం.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హీరోగా మరీ ... ఏ స్టార్ హీరోకి సాధ్యం కానీ విధంగా డిఫరెంట్ సినిమాలను చేస్తూ.. వరస విజయాలను నమోదు చేసుకొంటూ.. కెరీర్ లో విజయ పథంలో దూసుకుపోతున్నాడు.. కమర్షియల్ సినిమా లతో కాకుండా వైవిద్య పాత్రలతో ప్రయోగాత్మకంగా సినిమాలను చేస్తూ హిట్స్ కొట్టడం ఒక్క విజయ్ సేతుపతికి మాత్రమే సాద్యమా అనుకొనేలా చేస్తున్నాడు. కాగా విజయ్ కెరీర్ ఇంతటి సక్సెస్ గా సాగుతున్నా.. ఎటువంటి వివాదాల జోలీకి వెళ్లకుండా.. తోటి హీరోల ఫంక్షన్స్ కు హాజరవుతు.. సినిమా రాజకీయాలను దూరంగా ఉంటూ అందరి ఆదరణ పొందుతున్నాడు. కాగా తాజాగా విజయ్ ఇప్పటి వరకు ఏ హీరో చెయ్యని పని చేస్తున్నాడు.. అందరితో శభాష్ అనిపించుకొంటున్నాడు. 
ఉలగాయుదా ఫౌండేషన్ నిర్వహిస్తున్న భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ బంగారు నాణేలను పంచనున్నాడు.. కళామతల్లి తనకు చాలా చేసిందని.. అందుకు ప్రతి ఫలంగా తను ఏదైనా చెయ్యడం కనీస ధర్మం అని చెబుతున్న విజయ్ ఎంపిక చేసిన 100 మంది సీనియర్ కళాకారులకు తలాఒక కాసు బంగారం కానుకగా అందించడానికి ముందుకొచ్చాడు. డిజిటల్ యుగం, టెక్నికల్ గా అభివృద్ధి చెందడంతో చిత్ర పరిశ్రమలో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు.. వారిని గుర్తించి వారికి ప్రోత్సాహం అందించేందుకే ఈ చిన్న ప్రయత్నం అని విజయ్ చెప్పాడు.. కాగా విజయ్ తాజాగా బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నట్లు సమాచారం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com