తిరిగి వీధులలలో పరుగులు తీయనున్న 25 వేల తత్వేర్ బస్సులు

- April 11, 2017 , by Maagulf
తిరిగి వీధులలలో పరుగులు తీయనున్న 25 వేల తత్వేర్ బస్సులు

 మధ్యంతర సెలవు ముగిసిన తర్వాత కింగ్డమ్ లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నుంచి 25  వేల బస్సులు పరుగులు పెట్టనున్నాయి. దీనితో ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్ళే సుమారు1.2 మిలియన్ల మంది విద్యార్ధులకి ఆయా బస్సుల ద్వారా తిరిగి రవాణా ప్రారంభమైంది.పాఠశాల రవాణా కోసం విద్య మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగంగా పరిగణించబడుతుంది, ఇది తత్వేర్  (అభివృద్ధి) కంపెనీ, 25,000 కంటే ఎక్కువ స్కూలు బస్సులు 28 వేల  డ్రైవర్లు, టెక్నీషియన్లు, నిర్వాహక సిబ్బందితో పాటు మార్గమధ్య పర్యవేక్షకులు 230 మంది అదనంగా బస్సుల ద్వారా తమ తమ  సేవలను అమలు పర్చేందుకు సమాయత్తం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలలో నుండి బాల బాలికల విద్యార్థుల ఇరువురికి బస్సుల ద్వారా రవాణా ఉచితంగా అందించబడుతుంది.తత్వేర్ సంస్థ యొక్క అధికారిక ప్రతినిధి మజీద్ గీలాబ్ అల్ మరి  మాట్లాడుతూ, తత్వేర్ అనేక సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రవాణా సేవలను అందించనుంది. విద్యార్థిని విద్యార్థులను తమ బస్సుల ద్వారా వారి తరగతులకు మొదటి రోజు నుండి సురక్షితంగా మృదువైన రవాణా చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com