నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 6మందికి పరిసరాలను శుభ్రం చేయాలనీ తీర్పు

- April 11, 2017 , by Maagulf
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 6మందికి పరిసరాలను శుభ్రం చేయాలనీ తీర్పు

అబూధాబీ : స్టీరింగ్ చేతిలో ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు వాహనం నడిపితే, కుదరదక్కడ .పోనీ మన దేశంలో మాదిరిగా  జరిమానా కట్టి జారుకుందామంటే అబూధాబీ లో అవకాశముండదు ..వళ్ళు హూనం అయ్యేలా ఆయా ఎంపిక చేసిన ప్రాంతాలలో నానా చాకిరి చేయిస్తారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన  ఐదుగురు  ఎమిరాటియులు మరియు ఒక జీసీసీ పౌరుడు పైన పేర్కొన్న కారణాలతో పోలీసులకు పట్టుబడ్డారు. అంతే ఇక వారితో మసీదులు శుభ్రం చేయించడం, రోడ్లను అద్దం మాదిరిగా ఊడ్పించడం, గ్రంధాలయాలలో దుమ్ము ధూళి బూజులు దూలపడం, పెట్రోల్ బంకులలో పని వంటి సామాజిక సేవా కార్యక్రమాలను బలవంతాన చేయిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ ఆరుగురు వ్యక్తులకు అబూధాబీ లో జనరల్ ప్రాసిక్యూషన్ ఈ తాజా సామాజిక సేవా శిక్షను జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com