బంగారు ఆభరణాల చోరీలో ఇరువురు ప్రవాసియ మహిళలకు ఆరునెలల జైలుశిక్ష
- April 11, 2017
దోహా:పరాయి వార్ పసిడి పాము వంటివని ఆ ప్రవాసీయ మహిళలు ఇపుడు ముక్కు చీదుకొంటూ పశ్చాత్త్తపం చెందుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ విదేశీ మహిళలు పార్ట్ టైం దొంగతనాలు చేసి మరింత సంపాదచాలనే పాడు బుద్ధితో దుష్ట యోచన చేశారు. స్థానిక సోయుక్యూ వాకీఫ్ వద్ద ఒక బంగారు నగల దుకాణంకు వెళ్ళి చేతివాటం ప్రదర్శించారు. ఏదో నగలు కొనేవారు మాదిరిగా అక్కడకు వెళ్ళి ఆభరణాలు చూపించేవారి దృష్టి మళ్లించి వారు గమనించినప్పుడు ఆయా ఆభరణాన్ని హ్యాండ్ బాగ్‌లో వేసుకోసాగారు. అయితే ఆ దుకాణంలో ఉన్న నిఘా కెమెరా వీరి చేష్టలను నిశితంగా రికార్డ్ చేసింది. అదేదో తమ సొంత షాప్ మాదిరిగా వివిధ బంగారు ఆభరణాలు అంశాల వారీగా దొంగిలించినందుకు దోహా క్రిమినల్ న్యాయస్థానం ఆ మహిళామణులను ఆరు నెలల కాలం కారాగారంకు పంపించారు. అలాగే శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







