వలసదారులకు స్వర్గధామం యూఏఈ

- September 30, 2015 , by Maagulf
వలసదారులకు స్వర్గధామం యూఏఈ

వలసదారులకు స్వర్గధామంగా యూఏఈ నిలుస్తోంది. ప్రపంచ వ్యాపితంగా లెక్కలు తీసి చూసినప్పుడు టాప్‌ 10లో యూఏఈకి చోటు దక్కింది. జీత భత్యాలు, అదనపు చెల్లింపులు, ప్యాకేజీలు, ఆనందకరమైన జీవనం వంటి వాటిల్లో వృద్ధి యూఏఈని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆగర్నజైషన్‌ లెక్కల ప్రకారం 1.4 శాతం వృద్ధి నమోదైంది. హెచ్‌ఎస్‌బీసీ తాజాగా నిర్వహించిన ఎక్స్‌పాట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 2015 సర్వేలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం కంటే ఎక్కువమంది యూఏఈ తమకు స్వర్గధామమని చెప్పారు. అదే వివిధ దేశాలకు సంబంధించిన లెక్కలు తీసుకుంటే ఈ సంఖ్య 41 శాతంగానే వుంది. దుబాయ్‌ అమెరికన్లను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు మరో సంస్థ సర్వేలో వెల్లడయ్యింది. కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి దేశాల్ని కాదని, యూఏఈ వైపు ఎక్కువమంది ప్రొఫెషనల్స్‌ కూడా మొగ్గు చూపడం విశేషంగా చెప్పవలసి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడతాయని సర్వే చేసిన సంస్థ హెచ్‌ఎస్‌బీసీ రిటైల్‌ బ్యాంకింగ్‌ మరియు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ ఖలీద్‌ ఎల్గిబాలి చెప్పారు. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com