భారీగా పేలుడు పదార్థాలు లభ్యం, పలువురి అరెస్ట్
- October 01, 2015
బహ్రెయిన్ భద్రతాధికారులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కొందరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తులకు ఇరాన్, ఇరాక్‌లతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని పొందుపర్చారు. మనామా దగ్గరలోని నువైద్‌రత్‌లో గల ఓ ఇంట్లో ఈ పేలుడు పదార్థాల్ని, ఆయుధాల్ని కనుగొన్నారు. పట్టుకున్నవాటిల్లో సి4 పేలుడు పదార్థాలతోపాటు, ఇతర పేలుడు పదార్థాలు ఒకటిన్నర టన్నుల మేర ఉన్నట్లుగా సమాచారమ్. రైఫిల్‌లు, పిస్టోల్‌లు, హేండ్ గ్రెనేడ్‌లు కూడా ఉన్నాయి. ఇరాన్, ఇరాక్‌లతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు పట్టుబడ్డ వ్యక్తులపై ఉండడంతో, రహస్యంగా విచారిస్తున్నారు. ఆగస్ట్‌లో బహ్రెయిన్ పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఓ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు మృతి చెందిన కేసులో వారిని అరెస్ట్ చేయడం జరిగింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







