భార్యతో గడిపిన దృశ్యాలు..ఇంటర్నెట్లో అమ్మకానికి పెట్టిన భర్త
- April 12, 2017
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఎన్నికష్టాలొచ్చినా తోడునీడగా ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ మనీ కోసం భార్య మానాన్ని కూడా అమ్మెందుకు వెనకాడలేదు ఆ రాక్షసుడు. బెడ్రూంలో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఇంటర్నెట్లో లైవ్ లో అమ్మకానికి పెట్టాడు. ఇల్లాలి మానప్రాణాల కాపాడాల్సిన మొగుడే ఇలా తన మానంతో ఆడుకున్నాడు. రక్షణ కోసం తన ప్రాణాలు అడ్డువేయాల్సిన భర్త..ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. హైద్రాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన షాక్ కు గురిచేసింది.
హైద్రాబాద్ జీడిమెట్ల చింతల్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్..కొద్దికాలంగా పోర్న్ సైట్లకు అడిక్ట్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు కొన్ని సైట్లలో మేల్ ఎస్కార్ట్ తన మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం భార్య గొడవ పెట్టుకుంది. బుద్ధిగా ఉంటానని చెప్పి భార్యను నమ్మించిన ఆ సాఫ్ట్వేర్ మరింతగా బరితెగించాడు. ఏకంగా భార్య నగ్నదృశ్యాలు రికార్డ్ చేశాడు.
ఓ రోజు రాత్రి పడకగదిలో భార్యకు తెలియకుండా ల్యాప్‌టాప్‌లో వెబ్‌క్యామ్ ఆన్ చేశాడు. ల్యాప్‌టాప్‌లో ఏదో సినిమా వస్తుండటంతో బాధితురాలికి ఏ మాత్రం అనుమానం రాలేదు. ఆ దృశ్యాల్లో ఎక్కువగా భార్య కనపడేలా రికార్డ్ చేశాడు. ఆ వెబ్‌క్యామ్‌ను ఒక లైవ్‌స్ట్రీమ్ వీడియో చాటింగ్ పోర్న్సైట్కు అనుసంధానం చేశాడు. డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
గత ఏడాది నవంబరులో ఇంటర్నెట్లో భార్య న్యూడ్ వీడియోలను సాఫ్ట్ వేర్..అశ్లీల సైట్లలో అప్ లోడ్ చేశాడు. ఆమె సన్నిహితులు ఆ దృశ్యాల్ని చూసి షాకయ్యారు. విషయాన్ని ఆమెకు తెలపడంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో శాడిస్టు మొగుడి నిర్వాకం వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం అతడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









