జీ నెట్ వర్క్ చేతికి మహేష్‌బాబు 'స్పైడర్'

- April 12, 2017 , by Maagulf
జీ నెట్ వర్క్ చేతికి మహేష్‌బాబు 'స్పైడర్'

మహేష్‌బాబు 'స్పైడర్' గురించి లేటెస్ట్ న్యూస్. బుధవారం ప్రిన్స్ ఫస్ట్‌ లుక్ రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి. ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. స్పైడర్ శాటిలైట్ రైట్స్‌ని జీ నెట్‌వర్క్ దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ కలిపి దాదాపు 26 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే ప్రిన్స్ కెరీర్‌లో శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్‌కి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్. దీన్ని కొనుగోలు చేసేందుకు జెమినీ, స్టార్ ఛానెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చివరకు జీ సొంతమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్‌లో మహేష్‌బాబు నిఘా అధికారిగా కనిపించనున్నాడు. ప్రిన్స్ పక్కన హీరోయిన్‌గా రకుల్ నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య విలన్. జూన్ 23న థియేటర్స్‌కి స్పైడర్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com