6 కేజీల బంగారం టాయిలెట్లో
- April 12, 2017
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు 12.65 కేజీల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 2.60 కోట్ల విలువైన 6.65 కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోని బాత్రూంలో బంగారం, నగలు దాచినట్లు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో అధికారుల తనిఖీలు చేయగా పిల్లల డైపర్లున్న పెట్టె దొరికింది. దీన్ని తెరిచి చూడగా బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. పెట్టెను తీసుకొచ్చిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే తమిళనాడుకు చెందిన మహ్మద్ మొహిద్దిన్గా గుర్తించారు.
అలాగే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలోని టాయిలెట్లో 6 కేజీల బరువున్న 12 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







