మనుషుల అక్రమ రవాణాపై ఎల్‌ఎంఆర్‌ఎ సీరియస్‌ యాక్షన్‌

- April 13, 2017 , by Maagulf
మనుషుల అక్రమ రవాణాపై ఎల్‌ఎంఆర్‌ఎ సీరియస్‌ యాక్షన్‌

 లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), మనుషుల అక్రమ రవాణాని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. మనుషుల అక్రమ రవాణాకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీపై చర్యలు ప్రారంభించింది. 'విన్‌ ఎ డొమెస్టిక్‌ వర్కర్‌' పేరుతో ఆ సంస్థ, అక్రమంగా ఎంప్లాయ్‌మెంట్‌ ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎల్‌ఎంఆర్‌ఎ సిఇఓ, నేషనల్‌ కమిటీ ఫర్‌ కంబాటింగ్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ అఔసామా అల్‌ అబ్సి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో ప్రతి ఒక్కరి భద్రతకీ భరోసా ఉంటుందనీ, అందరికీ సమాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందనీ, ఎవరైనా మనుషుల అక్రమ రవాణాకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com