పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకుని
- April 13, 2017
32 ఏళ్ళ షార్జా వ్యక్తి ఒకరు పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్ - అల్ మదమ్ పోలీస్ స్టేషన్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, దాంతో టీమ్‌ని పంపామనీ, అక్కడ ఓ వ్యక్తి క్రిటికల్ కండిషన్‌లో కన్పించాడని తెలిపారు పోలీసులు. అల్ ధయిద్ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారతనికి. పెట్రోల్‌ని తాగి, తనను తాను కాల్చుకోవడంతో అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. పొగను పీల్చడంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మానసిక సమస్యలతోనే ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది అతనికి రెండో సూసైడ్ అటెంప్ట్ అని విచారణలో తేలింది. గతంలో హై రైజ్ బిల్డింగ్ పై నుంచి దూకి, ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







