షార్జాలో ఓ భవనాన్ని చుట్టుముట్టిన అగ్నికీలలు
- October 01, 2015
షార్జాలో ఓ భవనం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. నిర్మాణంలో వున్న ఈ భవనంలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. నివాస భవనంగా మంటలు అంటుకున్న భవనాన్ని అధికారులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నారు. భవనం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన పొగ, కిలోమీటర్ల దూరం నుంచే కనిపించింది. సమీపంలోని రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ప్రమాద కారణాలు ఇంకా తెలియలేదు. ఎవరూ గాయపడినట్లుగానీ, మృతి చెందినట్లుగానీ తెలియరాలేదు. కింగ్ ఫైసల్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







