చెత్తకుప్పలో మంటలు చెలరేగడంతో 16 మంది దుర్మరణం
- April 15, 2017
కొలంబో: శ్రీలంకలోని కొలొన్నవ ప్రాంతంలో ఉన్న చెత్తకుప్పలో మంటలు చెలరేగడంతో ఆ చెత్త అంతా అక్కడ ఉన్న ఇళ్లపై పడింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇళ్లపై చెత్తకుప్పలు పడటంతో దాదాపు 100 ఇళ్ల వరకు నేలమట్టం కావడంతో 600 మంది నిరాశ్రయులయ్యారు. చెత్తకుప్పల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు 400 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఆర్మీ హెలికాఫ్టర్ల సహాయం తీసుకుంది. కనిపించకుండా పోయిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. .
కొలొన్నవ డంపింగ్ యార్డులో 23 మిలియన్ టన్నుల చెత్త ఉందని దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇటీవల శ్రీలంక పార్లమెంటు హెచ్చరించింది. ఇక్కడ ప్రతీరోజు 800 టన్నుల చెత్త వచ్చి చేరుతుంది. ఇది ప్రకృతి విపత్తు కాదు.. మానవ తప్పిదాల వల్ల జరిగిన ప్రమాదం. కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పార్లమెంటు సభ్యుడు ఎంఎస్.మారికర్ ఆరోపించారు.
గతనెల ఇథియోపియాలోను చెత్తకుప్ప ఇళ్ల మీడ పడిపోవడంతో దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







