కొత్తరూల్స్‌ ఎయిర్‌ ఇండియా లో

- April 17, 2017 , by Maagulf
కొత్తరూల్స్‌ ఎయిర్‌ ఇండియా లో

సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. దీంతోపాటు అపరాధ రుసుం విధించాలని కూడా నిర్ణయించింది. సదరు ప్రయాణికుడి వల్ల గంట ఆలస్యమైతే రూ.5లక్షలు, గంట నుంచి రెండు గంటల మధ్య ఆలస్యమైతే రూ.10లక్షలు, రెండుగంటలు దాటితే రూ.15లక్షలు జరిమాన విధిస్తారు.
ఇటీవల మహారాష్ట్ర ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయమై పార్లమెంట్‌లో కూడా తీవ్ర దుమారం చెలరేగింది. శివసేన ఎంపీలు ఒకదశలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజును చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా విమానయాన నిబంధనలను కఠినతరం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com