బ్రిటన్‌ రాజధాని నైట్‌ క్లబ్‌లో యాసిడ్‌ దాడి

- April 17, 2017 , by Maagulf
బ్రిటన్‌ రాజధాని నైట్‌ క్లబ్‌లో యాసిడ్‌ దాడి

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌ ప్రజలు యాసిడ్‌ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున కిక్కిరిసిన ఓ నైట్‌ క్లబ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన యాసిడ్‌ దాడిలో 12 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఈ దాడిలో ఉగ్రవాదులకు సంబంధముందని భావించడం లేదని పోలీసులు తెలిపారు.

దాడి జరిగిన సమయంలో నైట్‌ క్లబ్‌లో దాదాపు 600 మంది ఉన్నారు. నైట్ క్లబ్‌లో ఉన్నవారిపై గుర్తు తెలియని ప్రమాదకర పదార్థాన్ని చెల్లారని లండన్‌ ఫైర్‌ బ్రిగేడ్‌ ప్రతినిధి చెప్పారు. పరీక్షల్లో ఇది ఓ ఆమ్ల పదార్థంగా తేలిందని ఆయన తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో వారు ఘటన స్థలానికి వెళ్లి, క్లబ్‌కు వెళ్లే దారులన్నీ మూసివేయించి విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 2010 తర్వాత లండన్‌లో యాసిడ్‌ దాడులు పెరిగిపోతున్నాయి. దాదాపు 1800 కేసులు నమోదయ్యాయి. కొన్ని క్రిమినల్‌ గ్యాంగులు ఈ దాడులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల లండన్‌లోనే జరిగిన యాసిడ్‌ దాడిలో భార్యాభర్తలు, వారి మూడేళ్ల కొడుకు గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com