జియో డిస్కౌంట్ ఆఫర్ విమాన టిక్కెట్ పై
- April 18, 2017
ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్ధమైందట. ఏయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ను వినియోగదారుల సద్వినియోగం చేసుకోవచ్చని, 2017 జూన్ 20 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో ఇది వర్తిస్తుందని నివేదించింది.
వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆఫర్ను లాంచ్ చేయబోతున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు పేర్కొంది. ఈ విమానయాన సంస్థ మొదట ఈ ఆఫర్ గురించి ఓ ట్వీట్ చేసింది. అనంతరం వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ప్రత్యర్థ కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ(ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను టార్గెట్ చేసుకుని జియో ఈ వ్యూహాన్ని అమల్లోకి తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







