నగదు ఎక్సేంజ్ రేట్లను పెంచి. షాక్ ఇఛ్చిన ఎక్సేంజ్ హౌజ్‌లు
- April 18, 2017
విదేశాలకు వెళ్లి కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నవారికి ఎక్సేంజ్ హౌజ్‌లు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం కాస్ట్లీగా మారుతోంది. ఈ వారంలో ఎక్సేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్‌లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్లకు డీహెచ్2(రూ.35.12) వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్సేంజ్‌లపై కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్లు తెలిపాయి. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్లు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన లీడింగ్ ఎక్సేంజ్ హౌజ్‌లన్నీ, ఫారిన్ ఎక్సేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్‌లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్సేంజ్ హౌజ్‌లకు అధికారిక ప్లాట్‌ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ ఛైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. స్వల్పంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







