పుట్టినరోజు జరుపుకున్న హను రాఘవపూడి 'లై' షూటింగ్ లో
- April 19, 2017
యూత్‌స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి ఈరోజు(ఏప్రిల్ 19) తన పుట్టినరోజును యూనిట్ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా డైరెక్టర్ హను రాఘవపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మా చిత్రం షూటింగ్ అమెరికాలోని డిఫరెంట్ లొకేషన్స్‌లో జరుగుతోంది. జూన్ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్లో వెగాస్, లాస్ ఏంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్లో నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.
యూత్‌స్టార్ నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.
తాజా వార్తలు
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు
- షూటింగ్లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ







